News June 29, 2024

కాటంరాజు ఏలిన మా కనిగిరి చరిత్ర తెలుసా?

image

కనిగిరిని 13వ శతాబ్దంలో కాటంరాజు ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రిక ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కనిగిరి దుర్గాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించాడు. నాడు ఈ ప్రాంతాన్ని బంగారుకొండ అని కూడా పిలిచేవారు. ఆయన ఏలుబడిలో కడప, కర్నూల్ ప్రాంతాలు కూడా ఉన్నట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆయన పాలనలో కనిగిరి ప్రాంతంలో కరవు ఏర్పడటంతో నెల్లూరు పాలకుడైన మనుమసిద్ధి రాజుతో ఓప్పందం కుదుర్చుకున్నారని చరిత్ర.

Similar News

News October 8, 2024

ప్రకాశం: అర్జీల పరిష్కరం, ఎండార్స్మెంట్ తప్పనిసరి

image

గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో పరిష్కరించడంతోపాటు తగిన విధంగా ఎండార్స్మెంట్ ఇవ్వడం కూడా ముఖ్యమని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ స్పష్టం చేశారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. గ్రీవెన్స్ అర్జీలను పరిష్కరించి ఎండార్స్మెంట్ ఇవ్వడంపై ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రివ్యూ సమావేశం నిర్వహిస్తానని చెప్పారు.

News October 8, 2024

పెద్దారవీడు: పోక్సో కేసులో జైలుకెళ్లి వచ్చిన వ్యక్తి ఆత్మహత్య

image

పెద్దారవీడు మండలం సిద్ధినాయునిపల్లిలో రుద్రపాటి చిన్న వెంకట చెన్నయ్య (70) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు గతంలో పోక్సో కేసులో జైలుకెళ్లి వచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని పలిశీలించి పంచనామా నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు.

News October 8, 2024

రాచర్ల: టానిక్ అనుకొని పేలు మందు తాగి వ్యక్తి మృతి

image

టానిక్ అనుకొని పేలు మందు తాగి వృద్ధుడు మృతి చెందిన ఘటన రాచర్ల మండలంలో జరిగింది. ఆకివీడుకు చెందిన వెంకటయ్యకు ఆరోగ్యం సరిగాలేదు. ఆ నేపథ్యంలో అతను ..మందులు వాడుతూ ఉంటాడు. కాగా శనివారం గొర్రెలకు పేలు చంపే మందు, టానిక్ ఒకే చోట ఉన్నాయి. సరిగ్గా చూపులేని ఆయన పేలు మంది తాగేసి, అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆసుపత్రికి తరలించగా సోమవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.