News July 15, 2024
కాటసాని నాపై దాడికి యత్నం: మల్లెల రాజశేఖర్
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ తెలిపారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్న సమయంలో కాటసానిని విమర్శించినందుకు తనపై కక్ష పెట్టుకున్నారని పేర్కొన్నారు. దీనిపై ఎస్పీ క్రిష్ణకాంత్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 1, 2024
గోనెగండ్ల: చీరకు నిప్పు.. చికిత్స పొందుతూ మహిళ మృతి
గోనెగండ్లకు చెందిన సుంకులమ్మ (81) అనే మహిళ కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిందని సీఐ గంగాధర్ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. ఎస్సీ కాలనీలో ఉండే సుంకులమ్మ నవంబర్ 28న వేడి నీళ్ల కోసం పొయ్యి దగ్గరకు వెళ్లగా చీరకు నిప్పు అంటుకొని మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పేర్కొన్నారు. కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసామన్నారు.
News December 1, 2024
సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించండి: కలెక్టర్
నంద్యాల జిల్లాలో డిసెంబర్ 8న ప్రశాంత వాతావరణంలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసెంబర్ 5న సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వెలువడుతుందని తెలిపారు.
News December 1, 2024
KNL: ఎల్లుండి క్యాబినెట్ భేటీ.. హాజరుకానున్న జిల్లా మంత్రులు
ఏపీ క్యాబినెట్ భేటీ ఈనెల 3న నిర్వహిస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొదట ఈ నెల 4న నిర్వహించాలని భావించగా, దానిని 3వ తేదీకి మారుస్తూ తాజాగా సీఎస్ ఉత్తర్వులిచ్చారు. CM చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, టీజీ భరత్ హాజరుకానున్నారు.