News July 19, 2024

కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై ఫిర్యాదు

image

మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి నకిలీ పత్రాలతో తమ భూమిని కాజేశారని నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌కు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తోన్న గ్రీవెన్స్‌లో వారు ఈ ఫిర్యాదు చేశారు. పరిష్కారానికి మంత్రి అధికారులతో మాట్లాడారు.

Similar News

News December 12, 2024

ISPL: అక్షయ్ కుమార్‌ టీమ్‌లో కర్నూలు కుర్రాడు

image

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL)కు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డి ఎన్నికయ్యారు. హీరో అక్షయ్ కుమార్‌కు చెందిన శ్రీనగర్ మహావీర్ టీమ్ హనుమంత్ రెడ్డిని బేస్ ప్రైజ్ రూ.3 లక్షలకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 14 వరకు ముంబైలో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 6 జట్లు పాల్గొననుండగా హైదరాబాద్ టీమ్‌ను హీరో రామ్ చరణ్ కొనుగోలు చేశారు.

News December 12, 2024

మహానందిలో భక్తజన సందడి

image

మహానంది ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం ఆలయ ప్రాంగణంలో వివాహాలు ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులు స్థానిక రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరులలో స్నానాలు ఆచరించారు. అయ్యప్ప స్వామి దీక్ష దారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులందరూ సాధారణ, ప్రత్యేక, స్పర్శ దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

News December 12, 2024

నంద్యాల MP ప్రశ్న.. సమాధానం ఇచ్చిన కేంద్రం!

image

నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార శాఖ సమాధానం ఇచ్చింది. మహిళలను సోషల్ మీడియా వేధింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవచ్చా? అని ఎంపీ ప్రశ్నించారు. దీనికి కేంద్రం సమాచార శాఖ రిప్లై ఇచ్చింది. ‘సోషల్ మీడియాలో మహిళలను వేధించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. సైబర్ నేరాలకు పాల్పడే వారినీ చట్టప్రకారం శిక్షించొచ్చు’ అని స్పష్టం చేసింది.