News March 12, 2025

కాటారం: అటవీ సమీప గ్రామాల్లో పులి సంచారం!

image

కాటారం మండలంలోని రఘుపల్లి, వీరాపూర్, జాదురావుపేట, ఒడిపిలవంచ, గుమ్మల్లపల్లి గ్రామాల పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు పలువురు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సంచలనంగా మారాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. ఆయా గ్రామ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. SMలో పోస్టులు చూసిన ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిసింది.

Similar News

News December 10, 2025

WGL: రూ.60-100 కోట్ల వరకు మద్యం ఖర్చు..!

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో మద్యం పర్వం జోరందుకుంది. కుల, యువజన సంఘాల మద్దతు కోసం అభ్యర్థులు బ్రాండెడ్ మద్యంతో పాటు నాన్వెజ్ భోజనాలతో దావత్‌లు ఇస్తున్నారు. చిన్న గ్రామాల్లో రూ.లక్ష, పెద్ద గ్రామాల్లో రూ.5 లక్షల వరకు మద్యం ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. పోటీ ఎక్కువైతే ఈ వ్యయం రూ.20 లక్షలకు చేరుతోంది. ఉమ్మడి WGL జిల్లాలో మొత్తం రూ.60-100 కోట్ల వరకు మద్యం ఖర్చు అయ్యే వీలున్నట్లు అంచనా.

News December 10, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో 7 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా లేదా బీఎస్సీ లేదా ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nise.res.in/.

News December 10, 2025

నానో ఎరువులను ఎలా వాడాలి?

image

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్‌‌లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.