News March 12, 2025
కాటారం: అటవీ సమీప గ్రామాల్లో పులి సంచారం!

కాటారం మండలంలోని రఘుపల్లి, వీరాపూర్, జాదురావుపేట, ఒడిపిలవంచ, గుమ్మల్లపల్లి గ్రామాల పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు పలువురు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సంచలనంగా మారాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. ఆయా గ్రామ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. SMలో పోస్టులు చూసిన ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిసింది.
Similar News
News February 8, 2026
చిత్తూరు జిల్లాలో కోడి ధర KG రూ.140

చికెన్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆదివారం ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.132-రూ.140 లవరకు ఉంది. మాంసం రూ.191-రూ.216 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.218 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ.75 గా ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 8, 2026
చిత్తూరు: టెన్త్ విద్యార్థులకు మరో ఛాన్స్

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్ లో తప్పిదాల సవరణకు అవకాశం కల్పించారని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. విద్యార్థుల నామినల్ రోల్స్‌లో ఆన్ లైన్లో సవరణలు చేసుకునేందుకు హెచ్ఎం లాగిన్‌లో అవకాశం కల్పించారన్నారు. దీన్ని ఆయా హెచ్ఎంలు సద్వినియోగం చేసుకుని, ఈనెల 12వ తేదీ లోపు తప్పిదాలు ఉన్నట్లయితే సరి చేసుకోవాలన్నారు.
News February 8, 2026
ప్రచారానికి రేపే ఆఖరు.. నేతలపై ఒత్తిళ్లు

TG: మున్సిపోల్ ప్రచారానికి రేపు సాయంత్రంతో తెరపడనుంది. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు సుడిగాలి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమతమ ప్రాంతాల్లో ప్రచారానికి రావాలని ముఖ్యనేతలపై స్థానిక లీడర్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, BRSలో ఇదే పరిస్థితి ఉంది. మొత్తం 2,982 వార్డులకు 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 11న పోలింగ్ ఉండగా 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.


