News March 28, 2024

కాటారం: చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

image

కాటారం మండలంలోని సుందర్ రాజ్ పేటకు చెందిన విద్యార్థిని అక్షయ(15) చికిత్స పొందుతూ మృతి చెందింది. SI అభినవ్ వివరాల ప్రకారం.. ఈనెల 19న అక్షయ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాసేందుకు ఆమె తండ్రి ప్రవీణ్‌తో కలిసి, బైక్ పై వెళ్తోంది. ఈ క్రమంలో మద్దులపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. అక్షయ తలకు తీవ్ర గాయాలు కాగా.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

Similar News

News October 4, 2024

దుర్గామాతను దర్శించుకున్న రామగుండం ఎమ్మెల్యే సతీమణి

image

రామగుండం మున్సిపల్ పరిధిలోని 42వ డివిజన్, 50వ డివిజన్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దుర్గామాతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుర్గామాతను మొదటి రోజు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వారిని ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానం చేశారు.

News October 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొలువుదిరిన దుర్గ మాతలు @ కొండగట్టులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. @ దసరా లోపు టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. @ ఎల్లారెడ్డిపేటలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య. @ కేశవపట్నం పోలీస్స్టేషన్ లో నాగుపాము హల్చల్.

News October 3, 2024

కరీంనగర్: పెరుగుతున్న గుండె వ్యాధిగ్రస్థులు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మానసిక ఒత్తిడే కారణమని వైద్యులు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరంలో గుండె వ్యాధుల బాధితులు 30-50 ఏళ్లవారు 1760, 50 ఏళ్ల పైబడినవారు 2640 మంది ఉన్నట్లు వైద్య లెక్కలు చెబుతున్నాయి.