News March 28, 2024

కాటారం: చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

image

కాటారం మండలంలోని సుందర్ రాజ్ పేటకు చెందిన విద్యార్థిని అక్షయ(15) చికిత్స పొందుతూ మృతి చెందింది. SI అభినవ్ వివరాల ప్రకారం.. ఈనెల 19న అక్షయ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాసేందుకు ఆమె తండ్రి ప్రవీణ్‌తో కలిసి, బైక్ పై వెళ్తోంది. ఈ క్రమంలో మద్దులపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. అక్షయ తలకు తీవ్ర గాయాలు కాగా.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

Similar News

News January 11, 2025

వరంగల్: నకిలీ వైద్యులున్నారు.. పారా హుషార్..!

image

ఉమ్మడి WGL జిల్లాలో నకిలీ డాక్టర్ల వైద్యం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. NSPTలో పిల్లలు పుట్టేందుకు నకిలీ వైద్యుడి ట్రీట్మెంట్‌తో  ఓ మహిళ అస్వస్థతకు గురికాగా స్థానికులు పట్టుకున్నారు. ఇలానే.. WDPTలో ఒక ఆటో కార్మికుడు, WGLలో ఆపరేషన్ చేస్తూ ఒకరు, CHPTలో హెర్బల్ మందుల పేరుతో మహిళ మృతి చెందిన ఘటనలు జరిగాయి. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడుల్లో సుమారు 60కి పైగా నకిలీలను గుర్తించారు.

News January 11, 2025

కాజీపేట: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

image

మనస్తాపం చెంది ఓ ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన కాజీపేటలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన విద్యార్థిని(18) హనుమకొండలో 2023-24లో ఇంటర్ చదివింది. పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో సప్లిమెంటరీ రాసింది. మళ్లీ తప్పడంతో మసస్తాపం చెంది ఒంటరిగా బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News January 11, 2025

వరంగల్ ఐలోని జాతరకు వేళాయే

image

కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగుబంగారం, గొల్లకురుమలు, ఒగ్గు కళాకారుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న ఐలోని మల్లన్న పుణ్యక్షేత్రం స్వామివారి బ్రహ్మోత్సవాలకు రెడీ అయింది. గొల్లకురుమల జాతరగా పిలిచే ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలు 12 నుంచి ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు కొనసాగుతాయి. చుట్టుపక్కల జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.