News March 14, 2025

కాటారం: ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినా చిక్కని పెద్దపులి

image

కాటారం మండలం వీరాపూర్ అడవుల్లో లేగ దూడపై దాడి చేసి చంపిన పెద్దపులి మళ్లీ ఇప్పటి వరకు అటువైపు రాలేదు. లేగ దూడను చంపిన ప్రదేశంతో పాటు పలు ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినా పెద్దపులి చిక్కలేదని తెలుస్తోంది. లేగ దూడను చంపి అన్నారం వైపుగా వెళ్లినట్లు అధికారులు పాదముద్రల ఆధారంగా గుర్తించారు. పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లొద్దని, పులికి హాని కలిగించే చర్యలు చేపట్ట వద్దని హెచ్చరిస్తున్నారు.

Similar News

News March 17, 2026

విపక్షాలది అనవసర రాద్ధాంతం: ఎమ్మెల్సీ అద్దంకి

image

ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలపై ప్రతిపక్షాలు కావాలనే విషప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ మండిపడ్డారు. మంగళవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, పేదలకు సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను ఓర్వలేక బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం కేసులో సీబీఐ విచారణ పురోగతిపై బీఆర్‌ఎస్‌ ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని ఆయన నిలదీశారు.

News March 17, 2026

డిప్రెషన్‌ కూడా గుండెపోటుకు కారణమే!

image

గుండెపోటుకు కొలెస్ట్రాల్ మాత్రమే కారణం కాదని, మానసిక సమస్యలు, నిద్రలేమి కూడా ప్రధాన కారణాలని తాజా పరిశోధనలో వెల్లడైంది. 2.2కోట్ల మందిపై చేసిన అధ్యయనంలో.. డిప్రెషన్, యాంగ్జైటీ, PTSD వల్ల గుండెపోటు ముప్పు 3 రెట్లు పెరుగుతుందని తేలింది. ‘మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగి ధమనులు దెబ్బతింటాయి. అందుకే గుండెను కాపాడుకునేందుకు మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించండి’ అని వైద్యులు సూచిస్తున్నారు.

News March 17, 2026

బాపట్ల: 40.20 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

image

జిల్లాలో ఫిబ్రవరి నెలలో 40.20 లక్షల విలువైన 201 ఫోన్లు రికవరీ చేసినట్లు బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నేరుగా ఆయన ఫోన్లను అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 806 మొబైల్ ఫోన్లు ట్రేస్ చేసి రికవరీ చేశామన్నారు. ప్రజలు తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.