News February 4, 2025
కాటారం: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆవరణలో వాహనాల వేలం

కాటారం ప్రొహబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణంలో రేపు (బుధవారం) వాహనాల వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఎస్ఐ కిష్టయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహన వేలంలో పాల్గొనేవారు 50% సొమ్మును ముందస్తుగా చెల్లించాలని అన్నారు. మిగిలిన సొమ్మును వాహనం పొందిన తర్వాత అదే రోజు చెల్లించాలని వివరించారు. వేలంలో వాహనం తీసుకున్న వారు జీఎస్టీని కూడా చెల్లించాలని పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
32,670 మంది డ్వాక్రా మహిళలకు రూ. 212.32 కోట్లు

అల్లూరి జిల్లాలో 3,267 డ్వాక్రా గ్రూపులకు చెందిన 32,670 మంది మహిళలకు రూ.212.32 కోట్లు బ్యాంకు రుణాలను ఇవ్వడం జరిగిందని జిల్లా పీడీ మురళి బుధవారం తెలిపారు. 9 వేల గ్రూపులకు రూ. 417 కోట్లు రుణాలను ఇవ్వాల్సి ఉందన్నారు. తక్కువ వడ్డీతో మహిళల జీవనోపాధులకు రుణాలను ఇస్తున్నామని చెప్పారు. అల్లూరి జిల్లాలో మొత్తం 22,289 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయన్నారు.
News November 27, 2025
ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు: పాక్ రక్షణ మంత్రి

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలులో ఆరోగ్యంగా ఉన్నారని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. జైలులో 5స్టార్ హోటల్ కంటే మెరుగైన ఫుడ్ అందుతోందని, టీవీ చూసేందుకు, వ్యాయామానికి అనుమతిచ్చినట్టు చెప్పారు. నేడు, డిసెంబర్ 2న ఆయనను కలిసేందుకు కుటుంబసభ్యులకు జైలు అధికారులు అనుమతిచ్చారు. ఇమ్రాన్‌ను మరో జైలుకు తరలించారనే వార్తలను తోసిపుచ్చారు. రావల్పిండి జైలు దగ్గర ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళన విరమించారు.
News November 27, 2025
రాజవొమ్మంగి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి

రాజవొమ్మంగి గ్రామానికి చెందిన అబ్దుల్ ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. గ్రామంలో కిరాణా షాపు నిర్వాహకుడు దావుద్ కుమారుడు అయిన అబ్దుల్ ఆదివారం ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా రాజవొమ్మంగి శివారులో టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అబ్దుల్ కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


