News February 4, 2025

కాటారం: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆవరణలో వాహనాల వేలం 

image

కాటారం ప్రొహబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణంలో రేపు (బుధవారం) వాహనాల వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఎస్ఐ కిష్టయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహన వేలంలో పాల్గొనేవారు 50% సొమ్మును ముందస్తుగా చెల్లించాలని అన్నారు. మిగిలిన సొమ్మును వాహనం పొందిన తర్వాత అదే రోజు చెల్లించాలని వివరించారు. వేలంలో వాహనం తీసుకున్న వారు జీఎస్టీని కూడా చెల్లించాలని పేర్కొన్నారు.

Similar News

News April 16, 2026

వనపర్తి: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు

image

పెబ్బేరులో ప్రేమ, పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన జుర్రు మహేశ్‌పై కేసు నమోదు అయింది. ఓ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి 2021సంవత్సరం నుంచి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకొని మోసం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై పెబ్బేరు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.

News April 16, 2026

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ‘దోస్త్’ సందడి

image

డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ (DOST) ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని ప్రముఖ విద్యాసంస్థలైన నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ​అనుభవజ్ఞులైన అధ్యాపకులు, మెరుగైన వసతులు ఉండటంతో ఈ కళాశాలలకు డిమాండ్ పెరిగింది. మే 7 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లకు గడువు ఉంది.
#SHAREIT

News April 16, 2026

HYD: మత్తుకు బానిసయ్యారా? ఇక్కడికి తీసుకురండి

image

మత్తుకు బానిసైన వారికి విముక్తి కల్పించడం కోసం ప్రభుత్వం డీ అడిక్షన్ సెంటర్లను ప్రారంభించింది. HYD గాంధీ ఆసుపత్రిలోనూ సెంటర్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సేవలు ప్రారంభమయ్యాయి. మద్యం, గంజాయి, సిగరెట్ ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారటంతో వ్యక్తిగత జీవితంతో పాటు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటి నుంచి విముక్తి కల్పించడం కోసం చర్యలు చేపట్టారు.