News February 14, 2025
కాట్రేనికోన ప్రభుత్వ ఆసుపత్రి రోగికి డ్రెస్సింగ్ చేస్తున్న స్వీపర్

కాట్రేనికోన మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగికి స్వీపర్ డ్రెస్సింగ్ చేస్తున్న దృశ్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. MNO ఉన్నా రోగులకు చికిత్స అందించడం లేదని, చికిత్స నిమిత్తం వస్తున్న రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . గతంలో కూడా రోగుల పట్ల స్థానిక సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించేవారని రోగులు గుర్తుచేస్తున్నారు.
Similar News
News October 24, 2025
ఉపాధ్యాయులను ఇంటర్వ్యూ చేసిన కలెక్టర్

విదేశీ విద్యా విధానం ఆధ్యయానికి దరఖాస్తులు చేసుకున్న ఉపాధ్యాయులకు శుక్రవారం కలెక్టర్ అభిలాష అభినవ్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు జిల్లాలోని ఉపాధ్యాయులను విదేశీ విద్యా విధానాలు పరిశీలించేందుకు ఆసక్తి గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యా విధానాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
News October 24, 2025
గుర్తింపు ఫీజు, హరిత నిధి చెల్లించాలి: డీఐఈఓ

జిల్లాలోని ప్రభుత్వ రంగ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు గుర్తింపు ఫీజు చెల్లించాలని DIEO శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్లో సంబంధిత కాలేజ్ లాగిన్ ద్వారా “రికగ్నైజేషన్ ఫీజు” తప్పక చెల్లించాలని, విద్యార్థుల పూర్తి వివరాలను “ఆన్ లైన్ చెక్ లిస్టు”లతో సరి చూసుకోవాలని DIEO సూచించారు.
News October 24, 2025
ములుగు: జిల్లా స్థాయి యువజన పోటీల నిర్వహణ

జిల్లాలోని యువతకు జిల్లా స్థాయి యువజన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి సర్దార్ సింగ్ తెలిపారు. ఇన్నోవేషన్ (సైన్స్ మేళా ప్రదర్శన) జానపద నృత్యం, జానపద గీతం, కవిత్వ రచన, కథారచన, పెయింటింగ్ విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసు గలవారు పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ నెల 28న జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో నిర్వహిస్తామన్నారు.


