News April 11, 2024
కాట్రేనికోన: బోటు ప్రమాద క్షతగాత్రుడు మృతి

విశాఖ సముద్ర తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో బోటులో ఈ నెల 5వ తేదీన జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మత్స్యకారుడు రేఖాడి సత్తిబాబు(43) మృతి చెందారు. సత్తిబాబు మృతితో ఆయన స్వగ్రామమైన కాట్రేనికోన మండలం బలుసుతిప్పలో విషాదం నెలకొంది. 81 శాతం శరీరం కాలిన గాయాలతో 4 రోజుల నుంచి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సత్తిబాబు బుధవారం ఉదయం కన్నుమూశాడని డాక్టర్ మోహనరావు తెలిపారు.
Similar News
News March 24, 2025
రాజమండ్రి: మర్డర్ కేసులో పట్టుబడ్డ నిందితుడు

రాజమండ్రి రూరల్ హుకుంపేట డీ బ్లాక్‌లో ఆదివారం తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో నిందితుడు పల్లి శివకుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా నిందితుడు ముళ్ల కంచెలలో నుంచి పరారవుతున్న సమయంలో కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి వెంబడించారు. నిందితుడి నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ధైర్యసాహసాలతో ఎస్సై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
News March 24, 2025
తూ.గో: నేడు యధావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం

సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రేపు యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో, డివిజన్,మున్సిపల్ మండల కేంద్రాలలో ఉదయం 10.గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించి జిల్లా, డివిజన్ మండల, మున్సిపల్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు.
News March 23, 2025
రాజమండ్రి: మంత్రి దుర్గేశ్ గెటప్ ఫొటో వైరల్

ఇటీవల అమరావతిలో జరిగిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాలలో టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేశ్ బాలచంద్రుని వేషధారణలో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో మంత్రి దుర్గేశ్, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో MA చదువుకున్నపటి రోజుల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పట్లో బాలచంద్రుని గెటప్‌లో ఉన్న మంత్రి ఫొటో ప్రస్తుతం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది.