News December 20, 2024

కాట్రేనికోన: సముద్రంలో చిక్కుకున్న 14 మంది సురక్షితం

image

కాట్రేనికోన మండలం కొత్తపాలెం వద్ద భైరవపాలానికి 7.6 నాటికన్ మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో యాంత్రిక లోపంతో రెండు మత్స్యకార బోట్లు నిలిచి పోయాయి. వాటిలో చిక్కుకున్న 14 మంది మత్స్యకారులను ఎస్పీ కృష్ణారావు పర్యవేక్షణలో మెరైన్ ఇన్‌స్పెక్టర్ మూర్తి ఆధ్వర్యంలో ఇండియన్ కోస్టల్ గార్డు సిబ్బంది, ఓడలరేవు కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, అల్లవరం పోలీసులు సురక్షితంగా బోటులో ఒడ్డుకు చేర్చి గమ్యస్థానాలకు పంపారు.

Similar News

News January 18, 2025

రాజమండ్రి: పీఎం ఇంటర్న్ షిప్ గోడపత్రికలు ఆవిష్కరణ

image

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ ద్వారా రాబోయే ఐదేళ్లలో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు నైపుణ్యంతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. శనివారం రాజమండ్రి కలెక్టర్ ఛాంబర్‌లో పీఎం ఇంటర్న్ షిప్ పథకం గోడ ప్రతులను జిల్లా పరిశ్రమల అధికారి రామన్, సహాయ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, నైపుణ్య అభివృద్ధి అధికారి పెరుమాళ్ళరావుతో ఆవిష్కరించారు.

News January 18, 2025

కోరుకొండ నారసింహుని ఆలయంలో మద్యం, మాంసం

image

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం దత్తత ఆలయమైన కోరుకొండ నారసింహుని ఆలయం ప్రాంగణంలో మద్యం బాటిళ్లు దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఆలయ పవిత్రతను దెబ్బతీసే ఇటువంటి చర్యలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ వ్యవహారం బయట వారి పనా.. లేక ఆఫీస్ సిబ్బంది పనా అంటూ ఉన్నతాధికారులు నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.

News January 18, 2025

తూ.గో జిల్లాకు చివరి ర్యాంక్

image

ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో తూ.గో జిల్లా మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో వారి పనితీరు, పథకాల అమలు తదితర అంశాలపై ర్యాంకులు ఇచ్చినట్లు సమాచారం. అందులో ఉమ్మడి తూ.గో జిల్లా మంత్రులు, ఎంపీల పనితీరుకు చివరి ర్యాంకు ఇచ్చినట్లు తెలుస్తోంది. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం.