News April 8, 2024
కాట్రేనిపాడులో యువకుడిపై దాడి

ముసునూరు మండలం కాట్రేనిపాడులో యువకుడిపై దాడి చేశారు. ఆ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక ముసునూరు గ్రామానికి చెందిన రత్నకుమార్(21) మూడు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత రాత్రి తన కుమార్తె నువ్వు లేకపోతే చనిపోతానని అంటోందని రత్నకుమార్ను పిలిపించారు. బాలిక, ఇంటికి వచ్చిన యువకుడిపై బాలిక కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని రత్న కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.
Similar News
News November 13, 2025
కృష్ణా: హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు

హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కృష్ణా జిల్లా సెషన్స్ జడ్జి గోపి సంచలన తీర్పు ఇచ్చారు. బందరు (M) బుద్దాలపాలెంకు చెందిన కాగిత రామ్మోహనరావు 2013 ఫిబ్రవరి 28న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న శొంఠి పైడేశ్వరరావు, బొర్రా శ్రీనివాసరావు, బొర్రా స్వామికృష్ణ, కాగిత సోమయ్య, శొంఠి వీర వెంకటేశ్వరరావు, శొంఠి వీరాంజనేయులు, శొంఠి ముసలయ్యకు జీవిత ఖైదు విధించారు.
News November 13, 2025
స్వచ్ఛ ఆంధ్రలో ప్రతి అధికారి పాల్గొనాలి: కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం నాడు నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ, భవనాలు, లేవుట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు.
News November 13, 2025
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. రేపటి SA-1 పరీక్ష వాయిదా

జిల్లా వ్యాప్తంగా రేపు జరగనున్న SA-1 (సమ్మేటివ్ అసెస్మెంట్-1) పరీక్షల్లో భాగంగా నవంబర్ 14న జరగాల్సిన పరీక్ష బాలల దినోత్సవం సందర్భంగా వాయిదా వేసినట్లు DEO తెలిపారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు వాయిదా పడిన పరీక్ష నవంబర్ 17న, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు నవంబర్ 20న నిర్వహించనున్నట్లు సూచించారు. రేపటి పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను సురక్షితంగా భద్రపరచాలని DEO అధికారులను ఆదేశించారు.


