News October 28, 2024
కాణిపాకం ప్రధాన అర్చకుడు సస్పెండ్
కాణిపాకం ప్రధాన అర్చకులను సోమవారం దేవస్థానం ఈవో గురుప్రసాద్ సస్పెండ్ చేశారు. ఇన్‌ఛార్జ్ ప్రధాన అర్చకులుగా గణేశ్ గురుకుల్‌ను ఈవో గురుప్రసాద్ నియమించారు. ఉద్యోగంలో చేరేందుకు, ప్రధాన అర్చకుడిగా పదోన్నతి పొందేందుకు తప్పుడు పత్రాలు దేవస్థానానికి సమర్పించడంతో సస్పెండ్ అయినట్లు తెలిపారు.
Similar News
News November 13, 2024
చిత్తూరు: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత
రెవెన్యూ అంశాలపై తహశీల్దార్లు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లో చిత్తూరు, నగరి డివిజన్లకు సంబంధించిన RDOలు,తహశీల్దార్లతో రెవెన్యూ సంబంధిత అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరితో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
News November 13, 2024
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు మృతి
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటన రేణిగుంట విమానాశ్రయం పాత మార్గంలోని రామకృష్ణాపురం సర్కిల్ వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 35 సంవత్సరాల గుర్తు తెలియని యువకుడు షర్టు లేకుండా డ్రాయర్ ధరించి ఉన్నాడన్నారు. రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News November 12, 2024
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజీనామా చేయాలి: సప్తగిరి
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడానికి తీరిక లేని MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు. మంగళవారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు కుప్పంలో చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడిస్తానని బీరాలు పలికిన పెద్దిరెడ్డి నేడు అసెంబ్లీకి వెళ్లడానికి ముఖం చాటేశారని అన్నారు.