News October 28, 2024
కాణిపాకం వరసిద్ధుని సేవలో కంచి కామకోటి పిఠాధిపతి
కాణిపాకం వరసిద్ద వినాయక స్వామిని సోమవారం కంచి కామకోటి పీఠాధిపతి వవిజయేంద్ర సరస్వతి మహాస్వామి దర్శించుకున్నారు. ఆలయ ఈఓ గురు ప్రసాద్, అధికార సిబ్బంది మహా స్వామికి సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి శేషవస్త్రంతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే పీఠాధిపతి కలికిరి కొండ వద్ద వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత మహా విష్ణు మూర్తి ఆలయ కుంభాభిషేకంలో పాల్గొన్నారు.
Similar News
News November 3, 2024
3 ఉచిత సిలిండర్లు అందజేయడం ఎంతో సంతోషం: మంత్రి నాదెండ్ల
దీపం – 2 పథకం అమలు ద్వారా పేద మహిళలకు భరోసా కల్పించేలా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ..పేదల సమస్యలు అర్థం చేసుకున్న మన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, DY.CM పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయాలని నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
News November 2, 2024
తిరుపతి: హోంమంత్రి రెండు రోజుల పర్యటన వివరాలు
హోం మంత్రి తిరుపతి జిల్లాలో 2 రోజులు పర్యటించనున్నారు. 3న మధ్యాహ్నం 12.05 కు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొనున్నారు. 12.35 నుంచి 1.30 గంటల వరకు అలివేలు మంగాపురం గ్రామంలో పర్యటించనున్నారు. 3.10 గంటలకు పద్మావతి మహిళా యూనివర్సిటీలో అనంతపురం డీఐజీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోన్నారు. 11 కు అలిపిరి కపిల తీర్థం ఆలయం దర్శించనున్నారు.
News November 2, 2024
తిరుపతిలో బాలికపై అత్యాచారం.. యువకుడు అరెస్ట్
తిరుపతిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత బాలిక 9వ తరగతి చదువుతోంది. వెస్ట్ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన సతీష్(22) చెన్నైలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. ఇతనికి అన్లైన్ ద్వారా బాలిక పరిచయమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అతనిపై అలిపిరి పోలీసులు కేసు నమోదుచేసి రిమాండు తరలించారు.