News January 26, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు నంద్యాల ఎస్పీ శుభవార్త

కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉమ్మడి కర్నూలు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా శుభవార్త చెప్పారు. కానిస్టేబుల్ ఈవెంట్స్‌కు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు గైర్హాజరైన అభ్యర్థులు ఈనెల 27న హాజరుకావాలని పిలుపునిచ్చారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ ధ్రువపత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. 28వ తేదీతో అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ముగుస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
Similar News
News September 17, 2025
కొత్తగూడెం: హత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు

ఓ హత్య కేసులో నిందితుడైన పల్లం సాయికుమార్‌కు పదేళ్ల జైలు, రూ.1000 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి పాటిల్ వసంత్ తీర్పు చెప్పారు. కొత్తగూడెం గణేష్ టెంపుల్‌కు చెందిన బడికల సంతోష్‌ను సాయికుమార్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసి హత్య చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కోర్టుకు ఆధారాలు సమర్పించగా, నేరం రుజువైనట్టు తేలింది. కేసు ఛేదించిన పోలీసులను SP అభినందించారు.
News September 17, 2025
మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి: పవన్

AP: సమాజంలో వైషమ్యాలు సృష్టించే శక్తులు పేట్రేగిపోతున్నాయని కలెక్టర్లు, SPల సదస్సులో Dy.CM పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ‘సామాజిక వర్గాల మధ్య అంతరాలు సృష్టించే విద్రోహ శక్తుల పట్ల నిరంతర అప్రమత్తత అవసరం. CM చంద్రబాబు శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వండి. సుగాలి ప్రీతి కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. డ్రగ్స్ వ్యాప్తిపై ఉక్కుపాదం మోపాలి’ అని ఆదేశించారు.
News September 17, 2025
మేడారం గద్దెల చుట్టూ సాలహారం

మేడారం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నూతనంగా నిర్మించిన గద్దెల చుట్టూ గుడిని పోలిన సాలహారం నిర్మించనున్నారు. దీనిపై పూజారులు గుర్తించి ప్రతిపాదించిన వనదేవతల చరిత్ర, అమ్మవార్ల 700 రూపాలను చిత్రీకరించనున్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా చిత్రాలు రూపొందించనున్నారు.