News January 10, 2025
కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో 1,975 మంది క్వాలిఫై: ఏలూరు SP
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 9వ తేదీ వరకు నిర్వహించిన పురుష, మహిళ కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షలను సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ, డ్రోన్ కెమెరాల ద్వారా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పేర్కొన్నారు. 4,976 అభ్యర్థులకు హాల్ టికెట్స్ ఇవ్వగా వారిలో 3,453 మంది మంది హాజరయ్యారని వారిలో 1,975 మంది క్వాలిఫై అయినట్లు తెలిపారు.
Similar News
News January 24, 2025
ఏలూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఇద్దరు స్నేహితులు విజయవాడ నుంచి ఏలూరు వైపు బైక్‌పై వెస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్‌కు లారీ తగలడంతో అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. క్రాంతికుమార్ తలపై నుంచి లారీ వెనక టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఏలూరు జిల్లా పెదపాడు (మ)కడిమికొండ గ్రామ వాసిగా గుర్తించారు.
News January 24, 2025
ప.గో. త్వరలో ఆచంటలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
ఆచంటలో రూ.కోటి వ్యయంతో త్వరలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఉక్కు భారీ పరిశ్రమల కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గురువారం ఆచంట మండలం ఏ వేమవరం గ్రామంలో హాస్టల్ భవనాన్ని ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటు వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డయాలసిస్ కేంద్రం మంజూరులో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాత్ర ఎంతో ఉందన్నారు.
News January 23, 2025
ప.గో: పోక్సో కేసులో ఉపాధ్యాయుడికి జైలు శిక్ష
ఉండ్రాజవరం జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గోపాల కృష్ణమూర్తికి ఏలూరు పోక్సోకోర్టు రెండున్నరేళ్ల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్టు ఎస్సై శ్రీనివాస్ బుధవారం తెలిపారు. 2020వ సంవత్సరం ఫిబ్రవరి 28న పాఠశాలలో ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తల్లి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా వాదోపవాదాలు తరువాత ఈ నెల 21న కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.