News February 19, 2025
కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పరీక్షలు జరపండి: కలెక్టర్

రంపచోడవరంలో ఇంటర్, టెన్త్ పరీక్షలపై అల్లూరి జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. అల్లూరి జిల్లాలో మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షలు విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మంచి ఫలితాలు వచ్చేలా అందరు కృషి చేయాలన్నారు. ప్రతీ రోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.
Similar News
News October 26, 2025
VH ట్రోఫీలో RO-KO ఆడతారా? గిల్ ఏమన్నారంటే?

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఆడే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని భారత కెప్టెన్ గిల్ తెలిపారు. SAతో ODI సిరీస్ అనంతరం సెలక్టర్లు దీనిపై RO-KOతో చర్చిస్తారని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లందరూ డొమెస్టిక్ టోర్నీల్లో ఆడాల్సిందేనని చీఫ్ సెలక్టర్ అగర్కర్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ కోసం రోహిత్, కోహ్లీని VH ట్రోఫీలో ఆడాలని సూచించే అవకాశముంది.
News October 26, 2025
మెదక్: ‘పది రోజుల్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి’

రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్‌పై కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సమీక్షించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ఆయన తహశీల్దార్లు, ఆర్డీఓలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. 10 రోజుల తర్వాత దరఖాస్తులను తప్పకుండా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.
News October 26, 2025
ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు శంభాజీనగర్ స్టేషన్‌గా మార్పు

MHలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్‌గా మార్చినట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. మూడేళ్ల క్రితం ఔరంగాబాద్ సిటీ పేరునూ ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చిన సంగతి తెలిసిందే. పేర్ల మార్పును కొందరు సమర్థిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. పేర్లు మారిస్తే రైళ్లలో అందరికీ సీట్లు దొరుకుతాయా? ప్లాట్‌ఫామ్స్ క్లీన్‌గా ఉంటాయా? టికెట్లు వేగంగా బుక్ అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు.


