News October 24, 2024
కాపులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం: మంత్రి

సార్వత్రిక ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. గురువారం సాయంత్రం తాడేపల్లి కాపు కార్పొరేషన్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తారని అన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో కాపు భవనాల నిర్మాణాలు చేపట్టబోతున్నామన్నారు.
Similar News
News November 1, 2025
ఖాళీల భర్తీలు పక్కా ఉండాలి: అనంత కలెక్టర్

ఐసీడీఎస్లో ఖాళీల భర్తీకి నిబంధనల ఉల్లంఘనకు తావులేదని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్)పై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 36 వర్కర్లు, 68 హెల్పర్లు కలిపి మొత్తం 104 పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
News October 31, 2025
పోలీసు అమరవీరులకు జోహార్లు

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు జిల్లా ఎస్పీ జగదీశ్ జోహార్లు తెలిపారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల ముగింపు రోజున శుక్రవారం అనంతపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ జగదీష్, ఇతర పోలీస్ అధికారులు అమర వీరులకు నివాళులర్పించారు. వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ఓపెన్ హౌస్, రక్తదాన శిబిరాలు, వ్యాస రచన పోటీలు, ఉచిత వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు SP తెలిపారు.
News October 30, 2025
మహిళ సూసైడ్ అటెంప్ట్

గుత్తి మండలం అబ్బేదొడ్డినికి చెందిన శిరీష పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి, 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉండాలని శిరీషకు సూచించారు.


