News January 31, 2025

కాపులుప్పాడలో ఉరేసుకుని యువకుడి మృతి

image

భీమునిపట్నం జోన్ కాపులుప్పాడ వైఎస్‌ఆర్ కాలనీలో యువకుడు ఉరేసుకుని మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. అప్పులు బాధ తాళలేక సంతోశ్(25) ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు ఐ.ఎన్.ఎస్ కళింగలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 17, 2025

విశాఖ: రైతులకు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక అవకాశం

image

జిల్లాలో కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. కూరగాయలు దిగుబడి ఎక్కువగా ఉండి మద్దతు ధర లేకపోవడంతో రైతుల అవస్థలు పడుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ చేయక సహాయ సహకారాలతో రైతులు నేరుగా దగ్గరలోని రైతు బజార్లో తమ కూరగాయలు విక్రయించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. 

News February 16, 2025

పెందుర్తి: వరుసకు బాబాయ్.. అయినా పాడుబుద్ధి..!

image

వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి లైంగికంగా తనను వేధిస్తున్నాడంటూ 2023లో పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి పెబ్బిలి రవికుమార్‌పై ఫిర్యాదు చేసింది. వెంటనే అతను హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల పెందుర్తి పోలీసులు రిట్ పిటిషన్ వెయ్యగా బెయిల్‌ రద్దవ్వడంతో అతనిని శనివారం అరెస్టు చేసినట్లు ఏసీపీ సాయి పృథ్వీ తేజ తెలిపారు. రవికుమార్ ప్రస్తుతం ఏపీ బీసీ సమైక్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. 

News February 16, 2025

మహిళను బెదిరించిన వ్యక్తి అరెస్ట్: సైబర్ క్రైమ్ పోలీసులు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇబ్బందులు పెడుతున్న వ్యక్తిని శనివారం రిమాండ్‌కు పంపించారు. నగరానికి చెందిన ఓ మహిళకు ఫేక్ ఇన్‌స్టా ద్వారా తన ఫేస్‌తో అశ్లీలంగా మార్ఫ్ చేసిన ఫొటోస్ వచ్చాయి. న్యూడ్ వీడియో కాల్ చేయాలని లేదంటే ఫొటోస్ ఫార్వార్డ్ చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కంచరపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించి అరెస్ట్ చేశారు.

error: Content is protected !!