News January 30, 2025
కాఫీ రైతులకు రూ.50లక్షల బోనస్: పీవో

చింతపల్లి ఎకోపల్పింగ్ యూనిట్‌కు కాఫీ పళ్లు సరఫరా చేసిన రైతులకు రూ.50లక్షల బోనస్ చెల్లిస్తున్నామని పాడేరు ఐటీడీఏ పీఓ వి.అభిషేక్ గురువారం తెలిపారు. ముందుగా రైతులకు కిలోకు రూ.44 చెల్లించామన్నారు. ఇప్పుడు కేజీకి అదనంగా మరో రూ.8 బోనస్‌గా చెల్లిస్తున్నామన్నారు. గత ఏడాది చెల్లించిన బోనస్ కంటే రెట్టింపు అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 621మెట్రిక్ టన్నుల పార్మెంటు కాఫీని విక్రయించామన్నారు.
Similar News
News December 5, 2025
₹72 వేలు చోరీ చేసిన వ్యక్తి TTDకి ₹14 కోట్లు ఎలా కట్టాడు జగన్?: పల్లా

AP: TTD పరకామణి చోరీపై YCP చీఫ్ జగన్ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ‘చిన్న చోరీయే. పోయింది ₹72 వేలే’ అని అనడంపై TDP మండిపడుతోంది. ₹72 వేలు చోరీ చేసిన వ్యక్తి తిరిగి TTDకి ₹14CR ఎలా కట్టగలిగాడు? తీసుకోవడానికి సుబ్బారెడ్డి ఎవరు? దొంగిలించిన దానికి అదనంగా డబ్బిస్తే కేసు మాఫీ అవుతుందా? CBIకి ₹70 వేల కోట్లిస్తే మీ కేసులూ మాఫీ చేసేయొచ్చా జగన్!’ అని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు.
News December 5, 2025
పారిశ్రామికవేత్తల దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

వివిధ పథకాలు క్రింద మంజూరైన యూనిట్లు త్వరగా ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం శుక్రవారం కలెక్టరేట్ లో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చేసుకున్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలన్నారు. ఎపిఐఐసి భూములకు సంబంధించిన దస్త్రాలు త్వరగా పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News December 5, 2025
నిరంతర ట్రాకింగ్‌కు కేంద్రం ప్రతిపాదనలు! వ్యతిరేకిస్తున్న సెల్ కంపెనీలు

శాటిలైట్ ఆధారిత లొకేషన్ ట్రాకింగ్ (A-GPS) సిస్టమ్‌ను యాక్టివ్‌లో ఉంచడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. సెల్ టవర్ డేటా ఆధారంగా కేసులను దర్యాప్తు సంస్థలు విచారిస్తుంటాయి. దీనికి టెలికం సంస్థల డేటాపై ఆధారపడతాయి. కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించాలంటే A-GPS తప్పనిసరి చేయాలని టెలికం సంస్థలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. అయితే ప్రైవసీకి భంగం కలుగుతుందని సెల్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి.


