News August 19, 2024

కామన్‌వెల్త్‌ పోటీలకు HYD నుంచి వైష్ణవి

image

పట్టుదల ముందు పేదరికం బలాదూర్‌ అనిపిస్తున్నారు సికింద్రాబాద్‌కు చెందిన యువ పవర్‌ లిఫ్టర్‌ వైష్ణవి. అక్టోబరు 4 నుంచి 14 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే కామన్‌వెల్త్‌ పోటీల్లో రాష్ట్రం నుంచి ముగ్గురికి అవకాశం లభించింది. అందులో హైదరాబాద్‌ నుంచి వైష్ణవి ఉన్నారు. ఆర్థికస్తోమత లేక గతంలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేదు. శిక్షకుడు కౌశిక్, దాతల సహకారంతో విజేతగా నిలిచి దేశానికి పేరు తెస్తానని చెబుతున్నారు.

Similar News

News December 10, 2025

HYD: అటూ ఇటూ కాకుండా పోయాం సారూ..!

image

గ్రేటర్ HYD ORR వరకు విస్తరించాక మహా GHMCగా మారింది. అయితే.. విలీన ప్రాంతాల్లో ఏర్పడుతున్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాల్టీలకు కాకుండా, GHMC హెల్ప్‌లైన్, ఆన్‌లైన్‌లో తమ వినతులకు స్పందనరాక అటూ ఇటూ కాకుండా పోయామని వాపోతున్నారు. ఇది శాఖలు, అధికార బదీలలపై సమన్వయ లోపమా అని నిలదీస్తున్నారు. తమ మేలుకోసమే జరిగిందనే ఈ విలీనంలో ఇబ్బందులు తెలత్తకుండా చూడాలని కోరుతున్నారు.

News December 10, 2025

HYD: CM సాబ్.. జర దేఖోనా!

image

నేడు CM రేవంత్‌ OUకు వస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు CM ముందు పలు డిమాండ్లు ప్రస్తవించారు. క్యాంపస్‌కు రూ.1000 కోట్లు, వర్సిటీ భూములను పరిరక్షించాలి, PHD విద్యార్థులకు రూ.20,000, ప్రతి విద్యార్థికి రూ.50,000 ఫెలోషిప్, హాస్టల్‌లోని మెస్‌లలో నాణ్యమైన భోజనం, స్కిల్ సెంటర్ ఏర్పాటు, విద్యార్థి సంఘాలపై నిర్భంధాలు ఎత్తివేయాలి, ఓయూ PSను క్యాంపస్‌ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.