News April 4, 2025
కామవరపుకోట: కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య

కామవరపుకోట మండలం ఉప్పలపాడులో గురువారం గంగాభవానీ అనే వివాహిత కడుపునొప్పి తట్టుకోలేక ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త, పిల్లలతో కలిసి ఇటీవల భవానీ పుట్టింటికి వచ్చింది. గత కొంతకాలంగా ఆమె కడుపు నొప్పితో బాధపడుతోందని, బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు గంగాభవాని తండ్రి సూర్యనారాయణ తెలిపారు.
Similar News
News January 8, 2026
ఏంటి తమ్ముడూ ఈ ఆట.. ఇంకా పెంచుతావా: అశ్విన్

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గత కొన్ని నెలలుగా <<18788014>>సంచలన ప్రదర్శన<<>> చేస్తున్నారు. దీనిపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించారు. గత 30 రోజుల్లో దేశీయ, U-19 క్రికెట్లో వైభవ్ సాధించిన 171, 190, 108*, 127 వంటి భారీ స్కోర్లను Xలో షేర్ చేశారు. “ఏంటి తమ్ముడూ ఈ ఆట? ఇంకా పెంచుతావా?” అంటూ తమిళంలో కామెంట్స్ చేశారు. ఇంత చిన్న వయసులో ఇంతటి భారీ స్కోర్లు చేయడం అద్భుతమని కొనియాడారు.
News January 8, 2026
ఉరి వేసుకుని మిర్యాలగూడలో మహిళ ఆత్మహత్య

ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడలో బుధవారం చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డపాక జగదీష్ తన భార్య నాగమణితో కలిసి పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉదయం బాత్రూంకు వెళ్లిన నాగమణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. మృతురాలి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 8, 2026
భిక్కనూరు: ఫార్మా ‘సీక్రెట్స్’ బట్టబయలు

భిక్కనూరులో ఫ్యూజన్ ఫార్మాకు ఇప్పటికే 2 ఎకరాల పర్మిషన్ ఉందని, ప్రస్తుత సేకరణ ‘విస్తరణ’ కోసమేనని తెలిసి జనం షాక్ అయ్యారు. ఆకుపచ్చ పరదాల చాటున అప్పుడే పనులు మొదలయ్యాయి. ఇదొక్కటే కాదు, మరికొన్ని కంపెనీలు కూడా సేకరణ జరగకుండానే పర్మిషన్లు పొందాయని పలువురు ఆరోస్తున్నారు. నాయకులు మాత్రం ‘పొలిటికల్ మైలేజ్’ చూస్తున్నారు తప్పా.. పనులు మొదలయ్యాక వీటిని ఆపడం సాధ్యమేనా? అని జనం ఆందోళన చెందుతున్నారు.


