News July 21, 2024
కామవరపుకోట: తండ్రిని హత్యచేసిన కొడుకు

కామవరపుకోట మండలం తడకలపూడి పంచాయతీ వేంపాడుకు చెందిన నాగబోయిన శ్రీనివాసరావు(50), కుమారుడు కార్తిక్‌తో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తండ్రి పేరిట ఉన్న రెండెకరాల పొలం అమ్మి.. తనకు సొమ్ము ఇవ్వాలని కార్తిక్ తరచూ గొడవ పడుతుండేవాడు. శనివారం ఇద్దరూ మరోమారు గొడవ పడ్డారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కొడుకు నేల పీటతో తండ్రి తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదైంది.
Similar News
News December 3, 2025
పెనుమంట్రలో ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని రైతులు RSKలను ధాన్యం అమ్మకాలకు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామ పంచాయతీ పరిధిలోని మార్టేరు బ్రాహ్మణచెరువు ప్రధాన రహదారిపై నిల్వ చేసిన ధాన్యం రాశులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. అనంతరం కొద్దిసమయం రైతులతో మాట్లాడారు.
News December 3, 2025
పశ్చిమలో ‘కొబ్బరి’కి కొత్త కళ..

ప.గో జిల్లాలోని కొబ్బరి రైతులు, అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. కొబ్బరి క్లస్టర్ పరిధిలో రూ.29.97 కోట్ల అంచనాతో చేపట్టనున్న అత్యాధునిక ‘కామన్ ఫెసిలిటీ సెంటర్’ పనులను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వాటా రూ.4.49 కోట్లలో.. తొలివిడతగా రూ.2.24 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కేంద్రం ద్వారా కొబ్బరి, బంగారం ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలు సాధించేందుకు మార్గం సుగమమైంది.
News December 3, 2025
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు తత్కాల్ అవకాశం: DEO

ఏపీ ఓపెన్ స్కూల్ 2025–2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు తత్కాల్ పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 2 నుంచి 6 వరకు అవకాశం ఉందని డీఈవో నారాయణ తెలిపారు. విద్యార్థులు రూ.600 అపరాధ రుసుము చెల్లించి అడ్మిషన్ పొందవచ్చునని అన్నారు. పూర్తి వివరాలను https://apopenschollo.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని ఆయన సూచించారు.


