News February 25, 2025
కామవరపుకోట: నిద్రలోనే మరణించిన యువకుడు

కామవరపుకోట మండలంలోని ఆడమిల్లిలో గ్రామంలో యువకుడు సోమవారం అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం నల్లమల్లి ఏలియా 34 అలియాస్ ప్రభాకర్ రావు సోమవారం గ్రామంలో జరిగిన బంధువుల ఫంక్షన్కు వెళ్లి ఇంటికి వచ్చాడు. అనంతరం పడుకొని లేవకపోవడంతో ఏలియ సోదరుడు సోమయ్య పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసే కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏలియా కు పెళ్లి కాలేదు.
Similar News
News December 5, 2025
NGKL: 14 మంది సర్పంచ్లు ఏకగ్రీవం

నాగర్కర్నూల్ జిల్లాలో మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో 14 మంది సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 151 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మండలాల వారీగా చూస్తే… కల్వకుర్తిలో 3, వెల్దండలో 4, ఊరుకొండలో 2, తెలకపల్లిలో 3, వంగూర్, తాడూరు మండలాల్లో ఒక్కొక్కరు సర్పంచ్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
News December 5, 2025
వేప పిండి, పిడకల ఎరువుతో ప్రయోజనాలు

☛ ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి.
☛ బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.
News December 5, 2025
VZM: కోర్టు కాంప్లెక్సుల్లో వాష్రూమ్ల నిర్వహణకు టెండర్లు

జిల్లాలోని వివిధ కోర్టు కాంప్లెక్సుల్లో 178 వాష్ రూమ్ల వార్షిక శుభ్రత నిర్వహణకు సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత శుక్రవారం తెలిపారు. 18 మంది క్లీనింగ్ సిబ్బందితో ఈ కాంట్రాక్ట్ ఏడాది కాలం అమలులో ఉంటుందని, ఆసక్తి గల అర్హులైన వారు తమ కొటేషన్లను ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, విజయనగరానికి సమర్పించాలని కోరారు.


