News February 24, 2025

కామారెడ్డికి డీకే అరుణ రాక

image

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సోమవారం కామారెడ్డికి రానున్నారు. ఉ.11 గంటలకు బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యుల సమావేశం ఉంటుందని పార్టీ నాయకులు తెలిపారు. 12:30 గంటలకు జిల్లా గ్రంథాలయంలో పట్టభద్రులతో సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు.

Similar News

News March 18, 2025

MNCL: బంగారం చోరీ.. ఇద్దరి అరెస్ట్: ACP

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగి ప్యాగ పోషంను కత్తితో చంపుతామని బెదిరించి మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన మొహమ్మద్ సమీర్, మొహమ్మద్ జుబీర్‌ను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాష్ సోమవారం తెలిపారు. సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు, కత్తి, బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

News March 18, 2025

బాధితులకు భరోసా కల్పించాలి: సూర్యాపేట ఎస్పీ 

image

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని అన్నారు.

News March 18, 2025

కరీంనగర్: బాలికలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ పమేలా సత్పతి

image

తిమ్మాపూర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలతో పాటు భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యతను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఏ సమయానికి ఏయే ఆహారం ఇస్తున్నారని విద్యార్థులను అడిగారు.

error: Content is protected !!