News April 8, 2025
కామారెడ్డిలో కల్తీ కల్లు తాగి 58 మందికి అస్వస్థత

కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ మండలం రామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే 46 బాన్సువాడ ఆసుపత్రికి, 12 మందిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 26, 2025
నూజివీడు: కార్తీక మాసంలోనూ తగ్గని మాంసం ధరలు

కార్తీక మాసంలోనూ నూజివీడులో మాంసం ధరలు తగ్గలేదు. ఆదివారం కిలో మటన్ రూ.750, చికెన్ రూ.220, రొయ్యలు రూ.300, చేపలు రూ.180 నుంచి రూ.380గా విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రం ఏలూరులో కిలో మటన్ రూ.900, చికెన్ రూ.220 నుంచి రూ.280, చేపలు రూ.150 నుంచి రూ.400, రొయ్యలు రూ.300గా ఉన్నాయి.
News October 26, 2025
గుంటూరులో నాన్ వెజ్ ధరలు ఇవే..!

గుంటూరులో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220, స్కిన్‌తో రూ. 200కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900 వద్ద స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ.440, రాగండి రూ.170, బొచ్చ రూ.220గా ఉంది. చేపలను కొనుగోలు చేయడానికి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News October 26, 2025
తుఫాన్: ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

AP: తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
* 27, 28 తేదీలు: తూ.గో, అన్నమయ్య, కడప జిల్లాలు
* 27, 28, 29 తేదీలు: ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాలు
> కోనసీమ జిల్లాలో వర్షాల తీవ్రతను బట్టి సెలవు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు. అటు మరిన్ని జిల్లాలకు హాలిడే ఇచ్చే అవకాశం ఉంది.


