News April 8, 2025
కామారెడ్డిలో కల్తీ కల్లు తాగి 58 మందికి అస్వస్థత

కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ మండలం రామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే 46 బాన్సువాడ ఆసుపత్రికి, 12 మందిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 18, 2025
ఆర్మూర్: అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి బాలిక సూసైడ్

ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్‌లో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. కడుపునొప్పి భరించలేక బుధవారం రాత్రి బాలిక అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిందని బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
News April 18, 2025
NZB: జిల్లా ప్రజల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నా: జడ్జి

జిల్లా ప్రజలు, న్యాయవాదుల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నానని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికి గురువారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. న్యాయవాదులు, న్యాయమూర్తుల ఉమ్మడి లక్ష్యం కక్షిదారులకు కాలానుగుణంగా న్యాయ సేవలు అందించడమేనన్నారు. సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించే వరకు సమష్టిగా శ్రమించామని గుర్తు చేశారు.