News February 14, 2026
కామారెడ్డిలో కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’

కామారెడ్డి మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, DCC చీఫ్ మల్లికార్జున్ సమక్షంలో ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఈ చేరికలతో కాంగ్రెస్ బలం 21కి చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్‌కు ఇంకా 4 సభ్యుల మద్దతు అవసరం ఉంది. MP ఎక్స్ అఫీషియో ఓటును కలుపుకొన్నా, మరో ముగ్గురు కౌన్సిలర్ల మద్దతు ఉంటేనే కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.
Similar News
News March 11, 2026
సంగారెడ్డి: 12న మున్సిపల్ ప్రజాప్రతినిధులకు శిక్షణ

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు చెందిన నూతన ఛైర్మన్లు, కౌన్సిలర్లకు ఈనెల 12న శిక్షణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ చట్టం-2019పై ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. శిక్షణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
News March 11, 2026
2027 జనగణన.. ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

AP: 2027 జనగణనలో భాగంగా ఈ ఏడాది మే 1 నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ చేపడుతున్నట్లు CM CBNకు సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె.నివాస్ వివరించారు. జనాభా లెక్కల ప్రక్రియ 2 దశల్లో జరగనుండగా, తొలి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన చేపట్టనున్నట్టు తెలిపారు. మే 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. APR 16-30 స్వీయ గణనకు అవకాశం కల్పిస్తారు. రెండో దశలో 2027 FEB నుంచి జనాభా లెక్కింపు ఉంటుంది.
News March 11, 2026
WGL: యుద్ధం ఎఫెక్ట్.. ఇంటికి ఆలస్యంగా వంట గ్యాస్!

యుద్ద ప్రభావంతో వంట గ్యాస్ ఇంటికి చేరడం ఆలస్యం అవుతోంది. ఉమ్మడి వరంగల్‌లో అన్ని ఆయిల్ కంపెనీలకు చెందిన వంట గ్యాస్ కనెక్షన్లు సుమారుగా 11.14 లక్షలు ఉండగా, గ్యాస్ బుక్ చేసుకున్న వారికి గతంలో రెండు, మూడు రోజుల్లో ఇచ్చే గ్యాస్ ఇప్పుడు పది రోజులు పడుతోంది. గ్యాస్ ధరను ఒకేసారి రూ.60 పెంచి రూ.984 చేశారు. యుద్ధ భయంతో గ్యాస్ బుక్ చేసుకున్న 25 రోజులోనే మళ్లీ చేసుకుంటున్న వారికి బుక్ కావట్లేదని అంటున్నారు.


