News February 14, 2026

కామారెడ్డిలో కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’

image

కామారెడ్డి మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, DCC చీఫ్ మల్లికార్జున్ సమక్షంలో ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఈ చేరికలతో కాంగ్రెస్ బలం 21కి చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్‌కు ఇంకా 4 సభ్యుల మద్దతు అవసరం ఉంది. MP ఎక్స్‌ అఫీషియో ఓటును కలుపుకొన్నా, మరో ముగ్గురు కౌన్సిలర్ల మద్దతు ఉంటేనే కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.

Similar News

News March 13, 2026

గద్వాల్ జిల్లాలో రేపటి నుంచే ‘పది’ పరీక్షలు

image

గద్వాల్ జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 40 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లాలోని 187 ఉన్నత పాఠశాలల నుండి సుమారు 8057 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను అధికారులు కల్పించారు. # ఆల్ ది బెస్ట్

News March 13, 2026

అమరావతి అగ్నిప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం

image

అమరావతి ప్రాంతంలోని మందడం దగ్గర జరిగిన భారీ మంటల ఘటనపై CM చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సమావేశంలోని టీ సమయంలో ఉన్నతాధికారులతో ఈ అంశాన్ని చర్చించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పరిశీలించాలని సూచించారు. నిర్మాణ పనులకు ఉపయోగించే సామగ్రి నిల్వ ఉన్న ప్రదేశంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో జరిగిన నష్టం, పరిస్థితులపై పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు.

News March 13, 2026

నేడు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్

image

డిప్యూటీ సీఎం పవన్ నేడు విశాఖ రానున్నారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం హెలికాప్టర్ ద్వారా అల్లూరి జిల్లాకి బయలుదేరుతారు. నందిగరువులో మాటామంతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు అక్కడి నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి బేగంపేటకు తిరుగు పయనమవుతారు.