News February 14, 2026

కామారెడ్డిలో కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’

image

కామారెడ్డి మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, DCC చీఫ్ మల్లికార్జున్ సమక్షంలో ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఈ చేరికలతో కాంగ్రెస్ బలం 21కి చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్‌కు ఇంకా 4 సభ్యుల మద్దతు అవసరం ఉంది. MP ఎక్స్‌ అఫీషియో ఓటును కలుపుకొన్నా, మరో ముగ్గురు కౌన్సిలర్ల మద్దతు ఉంటేనే కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.

Similar News

News March 15, 2026

తుంగతుర్తి: బ్రాహ్మణులకు MLA సామేలు క్షమాపణ

image

బ్రాహ్మణ సమాజంపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల MLA మందుల సామేలు విచారం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని, పొరపాటున దొర్లిన మాటలే తప్ప ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల పట్ల తనకు గౌరవం ఉందని, తన వ్యాఖ్యల వల్ల బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతింటే బేషరతుగా క్షమాపణలు కోరుతున్నానన్నారు. ఇటీవల ఆయన వ్యాఖ్యలపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

News March 15, 2026

ఏప్రిల్‌లో రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభం: కలెక్టర్

image

ఏప్రిల్ రెండో వారం నుంచి రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కలెక్టర్ డా. సత్యశారద తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె సమీక్షించారు. రైస్ మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, మాయిశ్చర్ మీటర్లు, వేయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.

News March 15, 2026

కృష్ణా: గ్యాస్ బుకింగ్‌పై మార్గదర్శకాలు జారీ

image

కృష్ణా జిల్లాలో LPG సరఫరా క్రమబద్ధీకరణకు JC నవీన్ ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఒక సిలిండర్ బుక్ చేశాక, రెండో బుకింగ్‌కు పట్టణాల్లో 30 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి ఉండాలని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఈ నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.