News October 3, 2024
కామారెడ్డిలో డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 133 మంది హాజరు

డీఎస్సీ-2024 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమైంది. ఈ మేరకు కామారెడ్డి జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొదటిరోజు 133 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. నిన్న అమావాస్య కావడంతో తక్కువ మంది ధ్రువపత్రాల పరిశీలకు వచ్చినట్లు సిబ్బంది వెల్లడించారు. అలాగే ఈ నెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని అధికారులు సూచించారు.
Similar News
News November 19, 2025
అంకిత భావంతో కృషి చేయాలి: NZB కలెక్టర్

10వ తరగతి ఫలితాలు మరింత మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి MEOలు, కాంప్లెక్స్ HMలకు సూచించారు. ఒక్కో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల వారీగా నిర్వహణ తీరు, ఆయా బడుల స్థితిగతులు, బోధన తీరు, సదుపాయాల కల్పన తదితర అంశాలపై కలెక్టర్ MEOలు, కాంప్లెక్స్HMలతో చర్చించారు. వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
News November 19, 2025
NZB: వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి: DMHO

NZB జిల్లాలోని PHCలు, సబ్ సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (DMHO) డా.రాజశ్రీ ఆదేశించారు. అవుట్ పేషెంట్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. గర్భిణుల వివరాల నమోదులో అలసత్వం వహించే ANMలు, ఆశా కార్యకర్తలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.
News November 19, 2025
నిజామాబాద్: 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా

నిజామాబాద్ డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 30 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మరో ఏడుగురికి జైలు శిక్ష పడింది. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.


