News March 6, 2025
కామారెడ్డిలో ఫ్లెక్సీ షాపులు బంద్

మార్చ్ 8, 9వ తేదీల్లో కామారెడ్డిలో ఫ్లెక్సీ షాపులు బంద్ చేస్తున్నట్లు ఫ్లెక్సీ షాప్ అసోసియేషన్ యజమానులు తెలిపారు. ఫ్లెక్సీ కలర్స్ మెటీరియల్స్ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో నిరసిస్తూ.. నూతన ధరలను పెంచడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఈ నెల 8, 9 రెండు రోజులు ఫ్లెక్సీ షాపులు బంద్ పాటిస్తున్నట్లు యజమానులు తెలిపారు.
Similar News
News March 6, 2025
రోడ్డు ప్రమాదాలకు ఇంజినీర్లే కారణం: గడ్కరీ

రోడ్డు ప్రమాదాలకు సివిల్ ఇంజినీర్ల తప్పులే కారణమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. డీపీఆర్, రోడ్డు డిజైన్లు సరిగా చేయట్లేదని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పారు. మన దేశంలో రోడ్ సిగ్నల్స్, మార్కింగ్ సిస్టమ్స్ లాంటి చిన్న పనులు కూడా అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. మనం స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
News March 6, 2025
తాడేపల్లిలో వైఎస్సార్టీయూసీ క్యాలెండర్ ఆవిష్కరణ

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్టీయూసీ క్యాలెండర్, డైరీ 2025ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి, వైఎస్సార్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ వై.శ్రీనివాస్, విశాఖ జిల్లా అధ్యక్షుడు అనీల్కుమార్, రాజారెడ్డి ఉన్నారు.
News March 6, 2025
NRPT: మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం

మన్యంకొండ వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతుల కారణంగా 24 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈనెల 8న శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదని చెప్పారు. నారాయణపేట, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లోని 245 గ్రామాలు రెండు మున్సిపాలిటీలకు నీటి సరఫరా ఉండదని చెప్పారు.