News February 2, 2025
కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కామారెడ్డిలోని నిజాంసాగర్ రోడ్డులో శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై రాజు వెల్లడించారు.
Similar News
News December 2, 2025
MBNR: PG ఫలితాలు.. చెక్ చేసుకోండిలా!

పాలమూరు యూనివర్సిటీ పీజీ ఫలితాలను యూనివర్సిటీ విసి జిఎన్ శ్రీనివాస్ ఇవాళ విడుదల చేశారు. పిజీ రెండవ సెమిస్టర్ (రెగ్యులర్ & బ్యాక్లాగ్), నాలుగవ సెమిస్టర్ (రెగ్యులర్ & బ్యాక్లాగ్), మూడవ సెమిస్టర్(బ్యాక్లాగ్) పరీక్ష ఫలితాలను https://results.palamuruuniversity.com/Results/Result/GetGrade/pK4_WPlVKVo= వెబ్ సైట్ లో సందర్శించాలన్నారు. SHARE IT.
News December 2, 2025
నియామక పత్రం అందుకున్న పున్న కైలాష్ నేత

నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు చనగాని దయాకర్, దైద రవీందర్ పాల్గొన్నారు.
News December 2, 2025
క్రికెట్లో సంగారెడ్డి జట్టు విజయం

బేపీఆర్ సింగపూర్ మైదానంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్ జిల్లాల క్రికెట్ అండర్ 14 పోటీలు నిర్వహించారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సిద్దిపేట పింక్ జట్టు 89 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన సంగారెడ్డి ఏ జట్టు 90 పరుగులు చేసి విజయం సాధించిందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు.


