News March 19, 2025

కామారెడ్డి: అంకిత భావంతో పనిచేసి మన్ననలు పొందాలి: జిల్లా కలెక్టర్

image

అంకిత భావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో స్టాఫ్ నర్సులు, వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్‌లుగా కాంట్రాక్టు పద్ధతిన నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు. తన ఛాంబర్‌లో స్టాఫ్ నర్సులు, వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్‌లుగా కాంట్రాక్టు పద్ధతిన నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు. 

Similar News

News November 22, 2025

రోజూ 30 నిమిషాలు నడిస్తే..!

image

రోజూ 30 నిమిషాలు నడవడం అత్యంత శక్తివంతమైన ఔషధమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనికి ఖర్చంటూ ఉండదని, దుష్ప్రభావాలు కూడా లేవని సూచించారు. ప్రతిరోజు అరగంట నడిస్తే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, డిప్రెషన్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇది మెరుగైన నిద్ర, ఉల్లాసకరమైన మూడ్‌ను ఇస్తుందని సూచించారు. SHARE IT

News November 22, 2025

ADB: ఈ నెల 24న జిల్లాకు మంత్రి జూపల్లి రాక

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఈ నెల 24న పర్యటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం రోడ్డు మార్గాన జిల్లాకు చేరుకొని ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బోథ్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అక్కడి నుండి నిర్మల్ జిల్లాకు వెళతారు.

News November 22, 2025

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అబ్జర్వర్‌గా నవీన్ కుమార్

image

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ పంతంగిలో జరగబోయే అండర్ – 17 బాలబాలికల రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను పర్యవేక్షించడానికి జడ్.పి.హెచ్.ఎస్ భూషణరావుపేట ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వీ. నవీన్ కుమార్‌ను రాష్ట్ర ఎస్ జీ ఎఫ్ క్రీడల అధికారిని ఉషా రాణి నియమించారు. ఈ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ వారు అభినందించారు.