News March 14, 2025
కామారెడ్డి: అక్కడ హోలీ పండగొస్తే గుండు ఎత్తాలి..!

హోలీ పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిర్వహిస్తారు. కాగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామంలో హోలీ పండుగను విభిన్నంగా నిర్వహిస్తారు. గ్రామంలోని ప్రజలంతా ఒక చోట చేరి పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు నిర్వహిస్తారు. అనంతరం ఆనవాయితీగా వస్తున్న బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తారు. ఈసారి 95 కేజీల గుండును ఎత్తాలని పోటీ పెట్టగా యువకులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
MBNR: TG ఖోఖో జట్టుకు ఎంపికైన డాక్టరమ్మ!

ఉమ్మడి పాలమూరు జిల్లా ఆత్మకూర్ వెటర్నరీ దవాఖానాలో వెటర్నరీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శిల్ప గతంలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ చాటి జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టుకు ఆడనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. క్రీడల్లో పాల్గొనేందుకు ఇప్పటికే దిల్లీకి బయలుదేరారు. CONGRATULATIONS
News March 21, 2025
పాస్టర్ల గౌరవ వేతనం విడుదల

AP: రాష్ట్రంలోని పాస్టర్లకు మూడు నెలల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,427మంది పాస్టర్లకు రూ.12,82,78,000 నిధులు విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం గత ఏడాది మే నెల నుంచి పాస్టర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తున్న సంగతి తెలిసిందే.
News March 21, 2025
ప్రకాశం జిల్లాలోని ఆ ప్రాంతాలలో ఎన్నికలు

ప్రకాశం జిల్లాలో మార్కాపురం MPP, త్రిపురాంతకం MPP, పుల్లలచెరువు వైస్ MPP, ఎర్రగొండపాలెం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలను ఈనెల 27వ తేదీన నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం తెలిపారు. 23వ తేదీన సభ్యులకు నోటీసులు అందించాలన్నారు. 27వ తేదీన MPP, వైస్ MPP పదవులకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపిక చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.