News October 10, 2024

కామారెడ్డి: అక్క ఆత్మహత్యాయత్నం.. బాధతో చెల్లి సూసైడ్

image

కామారెడ్డి జిల్లాలో బుధవారం విషాద ఘటన జరిగింది. వివరాలు.. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన మమతకు మోషంపూర్ వాసితో పెళ్లైంది. వారిమధ్య మనస్పర్థలు రాగా పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తిచెంది ఈ నెల 7న ఆత్మహత్యాయత్నం చేసింది. బాధతో ఆమె చెల్లి ప్రత్యూష సైతం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ప్రత్యూష చనిపోయింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 1, 2024

పేకాట ఆడితే చర్యలు తప్పవు: కామారెడ్డి SP

image

పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని, జిల్లాలో ఇంకా దాడులు కొనసాగుతున్నాయని KMR ఎస్పీ సింధూ శర్మ అన్నారు. ఇప్పటివరకు పేకాటలో 309 మందిపై కేసు నమోదు చేసి రూ.7,79,440 నగదుతో పాటు 146 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఎవరైనా పేకాడుతున్నట్లు తెలిస్తే వెంటనే టాస్క్ ఫోర్స్ అధికారుల నంబర్లు 8712686109, 8712686133కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. 

News November 1, 2024

NZB జిల్లాలో దీపావళి రోజు 116 కేసులు

image

జిల్లా వ్యాప్తంగా గురువారం భారీగా పేకాట కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ కమిషనర్, కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ శుక్రవారం వివరాలను వెల్లడించారు. దీపావళి సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 116 పేకాట కేసుల్లో 597 మంది పట్టుబడ్డారని తెలిపారు. వారి వద్ద రూ.11,47,240 స్వాధీనం చేసుకున్నామన్నారు.

News November 1, 2024

కామారెడ్డి: డబ్బుల కోసం తండ్రి హత్య

image

కామారెడ్డి జిల్లాలో నస్రుల్లాబాద్‌లో <<14501984>>హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. నెమలి గ్రామానికి చెందిన హన్మాండ్లు మద్యానికి బానిస అయ్యాడు. గురువారం అర్ధరాత్రి డబ్బుల విషయంలో తండ్రి సాయిబోయి(55)తో గొడప పడ్డాడు. ఈక్రమంలో మద్యం మత్తులో ఉన్న హన్మాండ్లు కర్రతో కొట్టడంతో చనిపోయాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.