News January 17, 2025

కామారెడ్డి: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి ఆధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. తెలుగు, చరిత్ర బోధించడానికి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో పీజీ పాసై ఉండాలన్నారు. పీహెచ్‌డీలో 50 శాతం మార్కులు, బోధనానుభవం కలిగిన ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అభ్యర్థులు శనివారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 2, 2025

గోరంట్ల బ్రిడ్జిపై తేలిన ఇనుప కడ్డీలు

image

గోరంట్ల సమీపంలోని బ్రిడ్జిపై ఇనుప కడ్డీలు తేలడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి ప్రారంభించిన రెండు మూడేళ్లకే ఇనుప కడ్డీలు తేలడంతో సంబంధిత గుత్తేదారు పనులు నాసిరకంగా చేశారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనిపై మంత్రి సవిత దృష్టి సారించాలని పలువురు పేర్కొంటున్నారు. తాత్కాలికంగా అపాయకరంగా మారిన ఇనుప కడ్డీలను తొలగించడమో, వాటిపై కాంక్రీట్ వేయడమో చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

News November 2, 2025

మంచిర్యాల: రూ.1.39 కోట్లు కాజేసిన నిందితుడి అరెస్టు

image

తప్పుడు లెక్కలతో వరి ధాన్యాన్ని చూపించి సివిల్ సప్లై నిధులు రూ.1.39 కోట్లు కాజేసిన కేసులో 3వ నిందితుడు సాయికుమార్‌ను అతని ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు జైపూర్ ఎస్సై శ్రీధర్ చెప్పారు. ఈ కేసులో మిగతా ముద్దాయిలు 12 మంది పరారీలో ఉన్నారన్నారు. వారిని పట్టుకోవడం కోసం ఎస్సై ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News November 2, 2025

MHBD: 22 ప్రైమరీ స్కూళ్లలో పోస్టుల వివరాలు!

image

22 ప్రైమరీ స్కూళ్లలో పోస్టుల వివరాలు. MHBD MPPS జమాండ్లపల్లి, ఈదులపుసపల్లి, గడ్డి గూడెం, దంతాలపల్లి-గున్నేపల్లి, లక్ష్మిపురం, నెల్లికుదురు-మునిగలవీడు, గూడూరు-అయోధ్యపురం, లక్ష్మిపురం, తొర్రూర్-వెలికట్ట, వెంకటాపురం, అమ్మాపురం, సీరోల్-కాంపల్లి, తాళ్లసంకీస, నర్సింహులపేట-బోడ్కాతండా, గార్ల-చినకిష్టాపురం, కురవి-గుండ్రతిమడుగు, హరిదాస్ తాండ, కేసముద్రం-కల్వల, బోడగుట్ట తాండ, చిన్నగూడూర్ జయ్యారంలో ఉన్నాయి.