News January 15, 2025
కామారెడ్డి: అయ్యప్ప ఆలయంలో మకర జ్యోతిని వీక్షించిన భక్తులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా, శబరిమలైలో భక్తులకు దర్శనమిచ్చే మకరజ్యోతిని వీక్షించేందుకు ఆలయంలో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మకర జ్యోతిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘ అధ్యక్షులు నస్కంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్, అన్న ప్రసాద సేవా సమితి అధ్యక్షులు రాజేందర్ ఉన్నారు.
Similar News
News November 12, 2025
తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా అడ్ హక్ కమిటీ నియామకం

తెలంగాణ జాగృతి బలోపేతంలో భాగంగా జిల్లా అడ్ హక్ కమిటీని బుధవారం కవిత ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లా కమిటీ సభ్యులుగా సూదం రవిచందర్, అవంతి కుమార్, ఎంఏ రజాక్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనారాయణ, భరద్వాజ్, రెహన్ అహ్మద్, విజయలక్ష్మి, నవీన్ నియమితులయ్యారు. అదే విధంగా జిల్లా అధికార ప్రతినిధులుగా తెలంగాణ శంకర్, ద్యావాడే సంజీవ్, శేఖర్ రాజ్, సంతోష్ నాయక్, తిరుపతి, రాములును నియమించారు.
News November 12, 2025
NZB: అభినందన సభావేదికను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమితులై గురువారం జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ లో సుదర్శన్ రెడ్డికి అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభా స్థలిని బుధవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ లు పరిశీలించారు.
News November 12, 2025
NZB: మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: సీపీ

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని నిజామాబాద్ కమిషనర్ పి.సాయి చైతన్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోటార్ వాహన చట్టం(2019) ప్రకారం డ్రంక్ & డ్రైవ్ తనిఖీలలో మొదటిసారి పట్టుబడితే రూ.10,000/- జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని అన్నారు. 3 సంవత్సరాల వ్యవధిలో రెండోసారి పట్టుబడితే రూ.15,000/- జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని పేర్కొన్నారు.


