News January 29, 2025
కామారెడ్డి: అర్హులైన వికలాంగులకు ప్రభుత్వం ఆర్థిక సాయం

అర్హులైన వికలాంగులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని కామారెడ్డి జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి ప్రమీల తెలిపారు. జిల్లాలోని వికలాంగులు 18 నుంచి 50 సంవత్సరాల వయసు లోపు వారికి తెలంగాణ ప్రభుత్వం రూ.50 వేల ఆర్థిక సాయం 100% సబ్సిడీ బ్యాంక్ లింక్ లేకుండా అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. అర్హత గల వారు కామారెడ్డి వికలాంగుల సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News October 28, 2025
2 రాష్ట్రాల్లో ఓట్లు… పీకేకు EC నోటీసులు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్కు EC నోటీసులు జారీ చేసింది. ఆయనకు 2 రాష్ట్రాల్లో ఓటు ఉండడమే దీనికి కారణం. పీకే WBలో ఓటరుగా ఉన్నారు. తర్వాత కర్గహార్ (బిహార్) నియోజకవర్గ ఓటరుగా నమోదు అయ్యారు. రెండు చోట్ల ఓట్లుండటాన్ని గుర్తించిన EC వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చింది. అయితే బిహార్లో ఓటరుగా నమోదయ్యాక WB ఓటును తొలగించాలని PK అప్లై చేశారని ఆయన టీమ్ సభ్యులు తెలిపారు.
News October 28, 2025
MBNR: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పరిశీలన

వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మంగళవారం సందర్శించారు. మొక్కలు ఎండబెట్టుకుని శుభ్రంగా తీసుకొస్తే ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని సూచించారు. పత్తి రైతులతో మాట్లాడుతూ.. స్లాట్ బుకింగ్ చేసుకుని వస్తే సీసీఐ పత్తి కొనుగోలు చేసిందన్నారు. తుపాన్ కారణంగా రేపు ఎల్లుండి వర్షం పడే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తగా తీసుకోవాలన్నారు.
News October 28, 2025
ప్రజలు ఇబ్బందులు పడకూడదు: మంత్రి అచ్చెన్న

కోనసీమ జిల్లాలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్న ఆదేశించారు. అమలాపురం ఆర్డీవో ఆఫీసులో ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తుఫాన్ గండం నుండి బయట పడాలని ఆకాంక్షించారు.


