News March 11, 2025
కామారెడ్డి: ఆయిల్ ఫాం సాగుకు రూ.50,918 రాయితీ

వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా.. NMEO-OP పథకం కింద ఆయిల్ ఫాం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కామారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జ్యోతి అన్నారు. ఆయిల్ ఫాం సాగు ప్రోత్సహించడానికి ఎకరానికి రూ.50,918 వరకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు.
Similar News
News September 15, 2025
విద్యాసంస్థలు జీవన వ్యవస్థలు: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

విద్యాసంస్థలు కేవలం భవనాలు కాదని, అవి దార్శనికత, విలువలు, ఉన్నత ప్రమాణాల కోసం నిరంతరం కృషి చేసే జీవన వ్యవస్థలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం దేశ నిర్మాణానికి దోహదపడే గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
News September 15, 2025
వ్యాయామం, రన్నింగ్.. మితంగా చేస్తేనే మేలు!

రోజూ వ్యాయామం చేయడం మంచిదే. కానీ అతిగా చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వారానికి 30-50kms రన్నింగ్ చేయొచ్చు. అలాగే రోజుకు 7000-10,000 అడుగుల నడక ఉత్తమం. ఎక్కువ దూరం పరిగెత్తడం వల్ల గుండె, కీళ్ల సమస్యలు పెరిగే ఛాన్స్ ఉంది. వారానికి రెండు నుంచి మూడు సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ సరిపోతుంది. మితమైన వ్యాయామం, సరైన విశ్రాంతి ముఖ్యం’ అని సూచిస్తున్నారు. SHARE IT
News September 15, 2025
విశాఖలో ఆరుగురు ఇన్స్పెక్టర్లకు బదిలీ

విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు ఇన్స్పెక్టర్లకు బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీపీ సీఐ మురళి, వెస్ట్ జోన్ క్రైమ్ సీఐ శ్రీనివాసరావులను విశాఖ రేంజ్‌కు సరెండర్ చేశారు. ఎంవీపీ లా అండ్ ఆర్డర్ సీఐగా ప్రసాద్, వెస్ట్ జోన్ క్రైమ్‌కు చంద్రమౌళి, ద్వారకా ట్రాఫిక్‌కు ప్రభాకరరావు, పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సిటీ వీఆర్‌లో ఉన్న భాస్కరరావును నియమించారు.