News March 11, 2025

కామారెడ్డి: ఆయిల్ ఫాం సాగుకు రూ.50,918 రాయితీ

image

వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా.. NMEO-OP పథకం కింద ఆయిల్ ఫాం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కామారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జ్యోతి అన్నారు. ఆయిల్ ఫాం సాగు ప్రోత్సహించడానికి ఎకరానికి రూ.50,918 వరకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు.

Similar News

News January 22, 2026

VJA: రైల్వే జీఎంను కలిసిన ఎంపీ కేశినేని

image

కొండపల్లి-విజయవాడ రైల్వే ట్రాక్ వెంబడి నెలకొన్న మురుగు, వర్షపు నీటి సమస్యకు పరిష్కారం చూపాలని MP కేశినేని చిన్ని కోరారు. సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాత్సవను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. క్రాస్ కల్వర్టులు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా ట్రాక్ భద్రతను కాపాడవచ్చని సూచించారు. ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు VJAలో ‘ఉపగ్రహ రైల్వే స్టేషన్’ ఏర్పాటు చేయాలన్నారు.

News January 22, 2026

60 రోజుల్లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలి: జిల్లా ఎస్పీ

image

కర్నూలు జిల్లాలో నేరాల నియంత్రణకు సాంకేతికతను సమర్థంగా వినియోగించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ మద్యపానంపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేస్తూ, పోక్సో కేసుల్లో 60 రోజుల్లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

News January 22, 2026

కొత్త GHMC కమిషనర్ కార్యాలయాలు ఇక్కడే!

image

ఫిబ్రవరి 10 తర్వాత GHMC 3 కార్పొరేషన్లు (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి)గా విడిపోనుంది. దీంతో కొత్త కార్పొరేషన్ల కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే హైదరాబాద్, తార్నాక పాత హెచ్ఎండీఏ కార్యాలయంలో మల్కాజిగిరి, మాదాపూర్లోని నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) బిల్డింగ్‌లో సైబరాబాద్ కార్పొరేషన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నట్లు తెలిసింది.