News March 24, 2025

కామారెడ్డి: ఆశా కార్యకర్తల ముందస్తు ARREST

image

కామారెడ్డి జిల్లా వివిధ మండలాల ఆశా కార్యకర్తలను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు హైదరాబాదులోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి ముందస్తుగా బయలుదేరిన ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుత నిరసనకు బయలుదేరిన తమను అరెస్ట్ చేయడం సబబు కాదన్నారు.‌

Similar News

News November 13, 2025

MCEMEలో 49 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

మిలటరీ కాలేజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(MCEME)49 గ్రూప్-C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/PET&PST, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 13, 2025

HYD: 3 నెలల్లోనే 4,000 కుక్క కాట్లు

image

HYDలో కుక్కల నియంత్రణకు కొత్త చర్యలు అమల్లోకి వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో కుక్కలు మరింత అగ్రసివ్‌గా ప్రవర్తిస్తున్నాయి. కుక్కను బెదిరిస్తే అది వెంటపడి దాడి చేసేలా పరిస్థితి మారిందని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 3 నెలల్లో 4,000 కుక్కల కాట్ల కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సమస్య ఎదురైనప్పుడు వెంటనే GHMC హెల్ప్‌లైన్ 040-21111111 నంబర్‌కి కాల్ చేయాలన్నారు.

News November 13, 2025

హనుమాన్ చాలీసా భావం – 8

image

ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామ లఖన సీతా మన బసియా ||
భావం: రాముడి చరిత్రను వినడానికి ఆసక్తి చూపిన వారి మనసులో రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ నివాసం ఉంటారు.
సుగుణాల రాముడి కథలను వినడం, పఠించడం వల్ల మనసు పరిశుద్ధమవుతుంది. ఫలితంగా ఆ దేవదేవుడు మన హృదయ మందిరంలో స్థిరంగా నిలుస్తాడు. నిత్యం దైవ స్మరణలో ఉంటే జీవితం ధర్మబద్ధంగా, శాంతియుతంగా ఉంటుందని ఈ శ్లోకం బోధిస్తోంది. <<-se>>#HANUMANCHALISA<<>>