News April 6, 2024
కామారెడ్డి: ఆస్తి పన్ను చెల్లించే వారికి గుడ్ న్యూస్

కామారెడ్డి జిల్లాలోని పురపాలికల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం పన్ను రాయితీ కల్పిస్తూ సర్కారు తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఈ నెలాఖరులోపు చెల్లించేవారికి అవకాశం వర్తించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో బకాయిలు లేనివారికి ప్రస్తుతం రాయితీ ఇచ్చారు. బకాయిలు 85 శాతం దాటి వసూలు కావడంతో ఈ సారి నూతనంగా ప్రకటించిన పథకానికి స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Similar News
News May 7, 2025
NZB: ‘ఉగ్రవాదంపై తీసుకునే చర్యపై మా మద్దతు ఉంటుంది’

కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకునే ఎలాంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాన్నారు. ఇలాంటి చర్యలు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా చేయాలన్నారు.
News April 25, 2025
నిజామాబాద్ జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లా జడ్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జిల్లా న్యాయమూర్తి జి.వి.ఎన్.భరతలక్ష్మిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో ఆమెకు పూల మొక్కను అందించి స్వాగతం తెలిపారు. ఇరువురు కొద్దిసేపు భేటీ అయ్యి జిల్లా స్థితిగతులపై చర్చించారు.
News April 25, 2025
KMR: ప్రైవేటు వీడియోలు ఉన్నాయంటూ MLAకు బెదిరింపులు

జుక్కల్ MLA తోట లక్ష్మి కాంత్ రావును బ్లాక్ మెయిల్ చేసిన ఓ రిపోర్టర్‌ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. MLAకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని.. రూ.5 కోట్లు ఇవ్వకుంటే వాటిని బయటపెడతానని ఓ మహిళతో కలిసి శ్యామ్ అనే రిపోర్టర్ బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు MLA ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి శ్యామ్‌ను అరెస్ట్ చేసి ఉప్పర్‌పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరు పరిచారు.