News February 8, 2025
కామారెడ్డి: ఆ స్తంభానికి కరెంట్ కనెక్షన్ లేదు: డిపో మేనేజర్

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి బస్టాండ్లో శనివారం కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు <<15397229>>విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందని<<>> సోషల్ మీడియాలో వచ్చిన వార్తపై ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. కామారెడ్డి నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. మాచారెడ్డి బస్టాండ్లో గతంలో విరిగి, ఎలాంటి కరెంట్ కనెక్షన్ లేని స్తంభాన్ని తాకిందని, ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారన్నారు.
Similar News
News November 2, 2025
ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే: KTR

TG: రేవంత్ నకిలీ వాగ్దానాలు, బెదిరింపు రాజకీయాలు జూబ్లీహిల్స్ ఓటమితోనే అంతమవుతాయని KTR వ్యాఖ్యానించారు. ‘500 రోజుల్లో KCR తిరిగి సీఎం అవుతారు. ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే. జూబ్లీహిల్స్లో భారీ మెజార్టీతో గెలుస్తాం. రేవంత్ చేసే బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పతనం ఖాయం. రేవంత్కు కాంగ్రెస్తో ఉన్నది ఫేక్ బంధం. BJPతో ఉన్నది పేగు బంధం’ అని విమర్శించారు.
News November 2, 2025
BREAKING: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీలు

AP: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ల బదిలీలు, నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్గా కృష్ణకాంత్ పటేల్, సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా ఈజీ అశోక్ కుమార్ తదితరులను బదిలీలు, నియామకాలు చేశారు.
News November 2, 2025
కొనసాగుతున్న కరీంనగర్ అర్బన్ ఎన్నికల కౌంటింగ్

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 12 డైరెక్టర్ స్థానాలకు 54 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పటిష్ట భద్రతా మధ్య కౌంటింగ్ కొనసాగుతుంది. అధికారులు పారదర్శకంగా లెక్కింపు చేపడుతున్నారు.


