News February 8, 2025

కామారెడ్డి: ఆ స్తంభానికి కరెంట్ కనెక్షన్ లేదు: డిపో మేనేజర్

image

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి బస్టాండ్‌లో శనివారం కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు <<15397229>>విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందని<<>> సోషల్ మీడియాలో వచ్చిన వార్తపై ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. కామారెడ్డి నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. మాచారెడ్డి బస్టాండ్‌లో గతంలో విరిగి, ఎలాంటి కరెంట్ కనెక్షన్ లేని స్తంభాన్ని తాకిందని, ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారన్నారు.  

Similar News

News February 7, 2026

గుంటూరు: అంబటి బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

image

CMని దూషించిన కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. అంబటిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్, అలాగే ఆయనకు బెయిల్ ఇవ్వాలని డిఫెన్స్ తరపు న్యాయవాదులు కోరిన పిటిషన్లపై గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. ప్రాసిక్యూషన్ తరపున డీడీ విజయలక్ష్మి, అంబటి తరపున పొన్నవోలు తమ వాదనలు వినిపించారు.

News February 7, 2026

పదేళ్ల బీఆర్ఎస్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం: అడ్లూరి

image

ధర్మపురి పట్టణానికి ఆనుకుని గోదావరి నది ఉన్నప్పటికీ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో ఆయన మాట్లాడుతూ.. గోదావరి నీటిని శుద్ధి చేసి పట్టణానికి అందించే ఆలోచన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేయలేదన్నారు.

News February 7, 2026

చక్కటి నిద్ర కోసం సింపుల్ టిప్స్

image

*ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.
*గదిలో చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. ఐ మాస్క్ ధరించాలి.
*రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయకూడదు.
*పడుకోవడానికి 3-4 గంటల ముందు మద్యం సేవించవద్దు.
*రోజూ ఉదయం వ్యాయామం చేయడంతో పాటు ఉదయాన్నే కనీసం 30 నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.