News February 25, 2026
కామారెడ్డి: ఇంటర్, పదో తరగతి పరీక్షలు.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

కామారెడ్డి జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీ ఏర్పట్లు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలు, సలహాలు సూచనలకు 9866143782, 9948164514 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలన్నారు.
Similar News
News April 20, 2026
వివాదాల్లో ఖమ్మం పోలీసులు..!

ఖమ్మంజిల్లాలో పనిచేస్తున్న కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఓ అధికారి గన్‌మెన్‌తో ఇంటి పనులు చేయిస్తున్న వీడియో వైరల్ కాగా, మరో అధికారి వద్ద పనిచేస్తున్న గన్‌మెన్ అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో DSPపోస్టుకు రూ.25లక్షలు, CIపోస్టుకు రూ.15లక్షల ధర పలుకుతున్నట్లు సమాచారం. ACB,Intelligence నిఘా ఉన్నా అవినీతికి చెక్ పడకపోవడంపై చర్చ సాగుతోంది.
News April 20, 2026
భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

భీమవరం చినమిరం ప్రాంతంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి అందిన సమాచారంతో సీఐ కాళీ చరణ్ నేతృత్వంలో దాడులు నిర్వహించి, నిందితుల నుంచి రూ.23,160 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
News April 20, 2026
మెగాస్టార్ సినిమాలో అనిల్ కపూర్?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బాబీ ఆయనకు కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి రోల్స్ కన్ఫర్మ్ అయితే మెగా సినిమాకు పాన్ ఇండియా హిట్ ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


