News February 25, 2026

కామారెడ్డి: ఇంటర్, పదో తరగతి పరీక్షలు.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

image

కామారెడ్డి జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీ ఏర్పట్లు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలు, సలహాలు సూచనలకు 9866143782, 9948164514 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలన్నారు.

Similar News

News April 14, 2026

3K టు 152K.. రఫేల్‌లా దూసుకెళ్లిన ప్రఫుల్ ఫాలోయింగ్

image

నిన్న RRపై తొలి ఓవర్లోనే 3 వికెట్లు, మొత్తంగా 4 వికెట్లు కూల్చిన <<19644312>>ప్రఫుల్(SRH)<<>> ఇన్‌స్టాలో రఫేల్‌లా దూసుకెళ్లారు. ఈ మ్యాచ్‌కు ముందు ఆయన అకౌంట్‌కు కేవలం 3 వేల ఫాలోవర్లు ఉండగా గంటల్లోనే ఆ సంఖ్య 152Kకు చేరింది. ఐపీఎల్ పవర్ ఇదేనని, 4 ఓవర్ల బౌలింగ్ ఆయన లైఫ్‌నే మార్చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇలాగే ప్రదర్శన చేస్తే తిరుగుండదని పేర్కొంటున్నారు. మీరేమంటారు?

News April 14, 2026

ADB: జీవితం అంటే ఓటమి కాదు.. మరో అవకాశం..!

image

విద్యార్థులారా..! కాగితం మీద పడ్డ ‘ఫెయిల్’ ముద్ర, నీ నుదుటి రాతను మార్చలేదు. పదో తరగతిలో తడబడిన సచిన్, ప్రపంచం కొలిచే శిఖరమయ్యాడు.. నువ్వు విసిరేసిన ప్రాణం, నీ కన్నవారికి తీరని శోకమవుతుంది. ​ఓటమి అనేది ముగింపు కాదు.. నిన్ను నువ్వు దిద్దుకునే ఒక మలుపు..!. ఇంటర్ రిజల్ట్స్ తర్వాత ఉట్నూర్, నర్సాపూర్, ఖానాపూర్‌లో విద్యార్థుల ఆత్మహత్యలు ఉమ్మడి ఆదిలాబాద్‌ను కలవరపెట్టాయి. ఇలా చేయొద్దు.

News April 14, 2026

గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు.. రేపే ప్రారంభం

image

AP: ప్రస్తుతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న అన్న క్యాంటీన్లు గ్రామాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఒకేసారి 62 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. రేపు పల్నాడు(D) ధరణికోటలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ఓపెన్ చేసి పేదలతో భోజనం చేస్తారు. కాగా పట్టణాల్లోని 207 క్యాంటీన్లలో ప్రభుత్వం రూ.5కే ఫుడ్ అందిస్తోంది. రోజుకు సగటున 2.10 లక్షల మంది ఆకలి తీర్చుకుంటున్నారు.