News November 15, 2024
కామారెడ్డి: ఇంటర్ విద్యార్థి సూసైడ్.. ఆరుగురిపై కేసు

కామారెడ్డికి చెందిన ఇంటర్ విద్యార్థి జశ్వంత్(17) HYD శ్రీ <<14605745>>చైతన్య <<>>కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు దర్యాప్తు చేయగా ఘటన స్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. బంధువులతో గొడవల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నాడు. ‘అమ్మను, చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి నాన్నా’ అంటూ లెటర్లో రాశాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 10, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సిబ్బందిని పరామర్శించిన CP

నిజామాబాద్లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు, మహిళా కానిస్టేబుల్ను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం పరామర్శించారు. సాయి నగర్-2 నుంచి హోంగార్డ్ అల్లం భూమయ్య ఆయన కూమర్తె మహిళా కానిస్టేబుల్ అల్లం మాధురిని నిన్న రాత్రి బైక్పై విధులకు తీసుకొస్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News November 10, 2025
NZB: 3.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

జిల్లాలో ఇప్పటికే దాదాపు 50% మేర 3.47 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడంతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో సేకరించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.
News November 10, 2025
అకోలా-కాచిగూడ రైలులో ఒకరి హత్య

అకోల నుంచి కాచిగూడ వెళ్లే రైలులో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి సోమవారం తెలిపారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. ఉమ్మడి గ్రామానికి చెందిన అతిశ రైలులో వాటర్ బాటిల్ అమ్ముకుంటూండగా, అదే గ్రామానికి చెందిన షేక్ జమీర్ వాటర్ బాటిల్ విషయంలో గొడవ పడ్డారు. దీంతో జమీర్ గాజు సీసాతో అతిశపై దాడి చేయగా మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కరికెల్లి, ధర్మాబాద్ మధ్యలో జరిగింది.


